7, ఏప్రిల్ 2011, గురువారం

పెళ్ళెందుకు ??? ... లొల్లెందుకు ??

http://gaavukeka.blogspot.com/2010/03/blog-post.html ఈయన బ్లాగ్లో అన్నీ పోస్ట్లు చాలా బాగుంటాయ్ ..ఇది కూడా :)





పెళ్ళెందుకు ??? ... లొల్లెందుకు ???
నా మునపటి టపాలో ఒక బ్రహ్మచారిగా నేను పడ్డ పాట్ల గురించి చర్చించాను , ఇక్కడ ... ఇప్పుడు పెళ్ళి చేసుకునే క్రమంలో నేను పడ్డ పురిటి నొప్పులపై పిచ్చాపాటి ...

ఎలాగైనా పెళ్ళి చేసుకోని , పెళ్ళి కాలేదనే నెపంతో నన్ను అవహేళన చేస్తున్న సోకాల్డ్ సభ్యసమాజపు అసభ్య జనాలకి గుణపాఠం నేర్పి , ఒక బ్రహ్మచారిగా నేనెదుర్కొంటున్న సామాజిక వివక్షని కూకటి వ్రేళ్ళతో పీకేద్దామని నిర్ణయించుకున్నాను ...

ఎప్పటిలాగే , ఆవేశంలో నిర్ణయమైతే తీసుకున్నాను గాని , తరువాత ఏమి చెయ్యాలో పాలు పోలేదు ..

ఇలాంటి క్లిష్టమైన నిర్ణయం తీసుకునేముందు , అసలు " పెళ్ళెందుకు ? " అని ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి అనుకున్నాను.. అనుకుందే తడవు " What Do you say Dude ? " అని అడిగాను నా ఆత్మారామున్ని ..

" నాకేం తెలుసు బే ? ముందటి బెంచీ వాడికే గతి లేక క్వశ్చన్ పేపర్‍ని తిరగ రాస్తుంటే , వెనక బెంచీ వాడు ఆన్సర్ చూపించమని అడిగినట్టుంది .. అవతలికి పో " అని మర్యాదగా మందలించాడు ఆత్మరాముడు ...

ఎమీ తోచక తల పట్టుకు కూర్చున్న నన్ను , మా కొలీగ్ హేమలత పరామర్శించింది ... విషయమంతా పూసగుచ్చకుండానే చెప్పాను ...

విషయమంతా విని , " ఇంకెన్ని రోజులు చేతులు తడుపుకుంటావు విజయ్ ??? నా మాట విని ఇంట్లో వాళ్ళు చూపించిన అమ్మాయిని చేసుకొని సెటిలైపో ?? " అంది నిట్టూరుస్తూ ..

" చేతులు తడుపుకోవడమేంటి ??? కాల్చుకోవడం కదా అనాల్సింది " అన్నాను మొహం చిట్లిస్తూ ..

ఇంతలో , " ఏంటబ్బా ? ఎంటీ సంగతులు ? " అంటూ సీన్‍లోకి ఎంట్రీ ఇచ్చాడు మా టీమ్‍మేట్ సుబ్బారెడ్డి ...

" ఆ .. రా ..రా .. సుబ్బారెడ్డి ... మంచి టైముకొచ్చావ్ " అంటూ ఆహ్వానించిన హేమలత వాయిస్ , మద్యాహ్నం ఆకాశవాణి రేడియోలో ప్రసారమయ్య్యే " పాడిపంట " ధారావాహికలో "రంగమ్మ" క్యారక్టర్‍ని తలిపించింది ..

" సుబ్బు , పెళ్ళయిన నువ్వైతే సరిగ్గా చెప్పగల్గుతావు ..కాస్త మన విజయ్‍కి పెళ్ళెందుకు చేసుకోవాలో అర్థమయ్యేట్టు చెప్పు" అంది హేమలత ముసిముసిగా నవ్వుతూ ..

" పెళ్ళికి ముందు హోటల్ తిండికి బాగా గ్యాస్ ప్రాబ్లమ్ ఉండెదబ్బా నాకు .. పెళ్ళి తరువాత మా ఆవిడ వంటకి దెబ్బకి తగ్గిపోయింది .." అన్నాడు సుబ్బారెడ్డి , త్రేన్చుతూ ..

" వాట్ డు యూ మీన్ ??? నా జీవితానికి సంబంధించిన " పెళ్ళి చేసుకోవాలి " అనే అత్యంత కీలక నిర్ణయాన్ని , నాకున్న గ్యాస్ట్రిక్ ట్రబుల్ ,నోటిపూత, సెగ్గడ్డలు వంటి మున్నగు ఆరోగ్య సమస్యలని ప్రాతిపదికగా చేసుకోని తీసుకోమంటావా యేంటి ? నెవర్ ... " అని వాళ్ళ మాటలని , నాకొచ్చిన ఇంపార్టంట్ అఫీషియల్ మెయిల్‍ని పట్టించుకోకుండా గూగుల్ టాక్‍లో చాట్ చేయడములో నిమగ్నమయ్యాను ..

ఇలా ఐతే విషయం తెగదని , పుస్తకాలు మంచి స్నేహితులనే విషయం గుర్తొచ్చి , సికింద్రాబాద్ రైల్వే ప్లాట్‍ఫారం మీద కొన్న " ౩౦ రోజుల్లో పెళ్ళి చేసుకోవడం ఎలా ?" బుక్ చదవడం మొదలెట్టాను ...

ఆలుమగల మధ్యన అనుబంధం " పైజామాలో నాడాలా , విస్తరాకులో చీపురు పుల్లలా పెనవేసుకొని ఉండాలి " లాంటి నగ్నసత్యాలతో పాటు ,పెళ్ళి చేసుకోబోయే బ్రహ్మచారులకి చక్కటి చిట్కాలు ఇచ్చారు పుస్తకంలో రచయిత కటుకోజు బ్రహ్మచారి గారు ...

ఆ చిట్కాల పరంపరలో , " ఎవరైనా సరే, పెళ్ళి చేసుకోవడానికి ఒక బలమైన కారణముండాలి .. ఎవరికివారు దాన్ని వెతుక్కోవాలి అని రాసుంది " ... ఆ కారణమే తెలిస్తే ఈ దిక్కుమాలిన పుస్తకం చదవాల్సిన అవసరమేందిరా నాకు ? అనవసరంగా 5౦ రూపాయల బొక్కెందుకురా బ్రహ్మచారిగా ?? అని తిట్టుకుంటూనే మిగతా చిట్కాల జాబితాని చదవడం కొనసాగించాను ..

ఇండియాలో , వివాహితులైన ప్రజల మీద తాజాగా జరిపిన సర్వేల ప్రకారం , ప్రజలు తాము పెళ్ళి చేసుకొవడానికి చెప్పిన కారణాలను విశ్లేశిస్తే , అతి ముఖ్యమైనవి నాలుగు రకాలని తేలాయి ... అవి ..

1. శృంగారం (80%) 2. సంతానం(పిల్లలు)( 10%) ౩. డబ్బు ( కట్నం)( 8% ) 4.సాంగత్యం( తోడు - నీడ ) ( 2% )

అన్ని ఆప్షన్స్ బాగానే తోచాయి నాకు ... ఏది ఎన్నుకోవాలో అర్థం కాక , పై నాలుగు ఆప్షన్స్ తో నాలుగు చీటీలు రాసి , కలబెట్టి వేసి , అందులో నుండి ఒక చీటిని కళ్ళు మూసుకొని తీశాను .. తెరిచి చూస్తే , అధిక శాతం జనాదరణ వున్న ఆప్షన్ గల చీటీ వచ్చింది .... " గుంపులో గోవిందులా ఉండలేని నా మనస్తత్వం " నన్ను తీవ్రంగా మందలించింది ...

ఏం చేయాలో తోచలేదు కాసేపు ... తళుక్కున ఒక ఆలోచన మెరిసింది .. వెంటనే చీటిలను చించి అవతల పారేసి , పంటలేసాను , నేనున్న గది మారుమ్రోగేలా ..."థూ , యెదవ .. నాలుగు ఆప్షన్లున్న ప్రశ్నకి పంటలేసి జవాబెతుక్కునే యెబ్రాసి మొహమూ నువ్వునూ " అన్న నా ఆత్మారాముడి తిట్టు మారుమ్రోగింది ఈ సారి గదిలో ....

సైలెంటయిపోయాను కాసేపు ... చేసేదేమి లేక , ఎప్పటిలాగే జీవితానికి సంబంధించిన కీలక నిర్ణయాలని కుటుంబ సభ్యులకే వదిలేసినట్టు , నా ఈ పెళ్ళి సంగతిని కూడా పెద్దల నిర్ణయానికే వదిలేశాను ..

నేను తీసుకున్న ఈ నిర్ణయానికి ఉక్కిరిబిక్కిరికి గురయ్యి , ఆనందం పట్టలేక , మిట్టమద్యాహ్నమనే విషయం మరచిపోయి రెండు చిచ్చు బుడ్లు . నాలుగు కాకరొత్తులు కాల్చారు మా ఇంట్లో వాళ్ళు ...

పొద్దున్నే వచ్చే పాలవాడి దగ్గ్గరి నుండి , రాత్రికి గస్తీ తిరిగే నేపాలి గూర్ఖ వరకు కనబడిన ప్రతీ ఒక్కడిని " మా అబ్బాయికి పెళ్ళి చేయాలనుకుంటున్నాము , మీకు తెలిసిన పిల్ల ఉంటే చెప్పండి " అంటూ అర్జీ పెట్టుకోవడం మొదలెట్టారు మా ఇంట్లోవాళ్ళు ...

పెళ్ళి బ్రోకర్లకు , అమ్మాయి తరఫునోళ్ళకు ఇవ్వాలనిచెప్పి , నన్ను దగ్గర్లో వున్న ఫోటొ స్టూడియోకెళ్ళి , పూలకుండీ పక్కన నిలబడి ౩ రకాల ఫోజులతో ( క్లోజప్ , మీడియం , లాంగ్‍షాట్ ) ఫోటోలు తీయించుకు పంపమని అడిగారు మా ఇంట్లోవాళ్ళు... అందుకు నిరాకరించిన నన్ను , క్రింది ఫోటోలో ఫోన్ పట్టుకు కూర్చుంది నేనే అని చెప్పి , ఫోటోలు పంచిపెడతామని బ్లాక్‍మెయిల్ చేశారు ...



ఏరియల్ వ్యూ తో కలిపి మొత్తం నాలుగు రకాల ఫోజులతో కూడిన ఫోటోలు దిగి పంపించాను ...

సరిగ్గా 4 రోజుల తరువాత , వరంగల్ జిల్లాలో ఒక మారుమూల ఊరిలో మా దూరపు బంధువుల తాలూకు అమ్మాయి ఉంది , చూడటానికి వెళ్ళాలని , వెంటనే ఇంటికి రమ్మని కబురు పంపారు మా ఇంట్లోవాళ్ళు ... పళ్ళెటూరమ్మాయి అయితే మాత్రమేంటి ? రోజా సినిమాలో అరవింద్ స్వామి అంతటోడు పల్లెటూరమ్మాయయిన మధుబాలని చేసుకోలేదా ? ఆమె మాత్రం క్లైమాక్స్ లో మొగుణ్ణి కాపాడుకోలేదా ఎంటీ ? అని నాకు నేను ధైర్యం చెప్పుకొని బయలుదేరా ..

జనాలతో క్రిక్కిరిసిన గదిలో ఇనుప చైరేసి కూర్చోబెట్టారు నన్ను .. సెక్స్ స్కాండల్‍లో పట్టుబడ్డ స్వామీజిని చూడటానికి వచ్చిన భక్తజనంలా తండోపతండాలుగా తరలివచ్చారు జనాలు నన్ను చూడటానికి ... చాలా ఇబ్బందిగా ఉన్నా చిరునవ్వుని చెరగనీయలేదు మొహం మీద ... నా పుట్టుపూర్వోత్తరాలు , పుట్టుమచ్చలతో సహా ప్రతీ విషయం అడిగి తెలుసుకొంటున్నాడు పిల్ల మేనమామ.. ఒక వైపు మా అమ్మమ్మ పిల్ల తండ్రిని తమ వంశవృక్షాన్ని ఒక ఫ్లోచార్ట్ గా గీసి భాగాలు గుర్తించమని వేపుకుతింటోంది ... ఇంతలో అమ్మాయిని తీసుకువచ్చి నా ఎదురుగా కూర్చోబెట్టారు ... చుట్టుపక్కలున్న అమ్మలక్కలు నన్ను చూసి ముసిముసిగా నవ్వారు , రిథమిక్‍గా ... సిగ్గుతో నా కాలి బ్రొటన వేళితో నేనేసిన ముగ్గుకి , క్రిందున్న కార్పెట్ కొద్దిగా చిరిగింది ... అమ్మాయిని చూద్దామని తలలేపా ... తలదించుకొని కార్పెట్‍కున్న దారపు పోగులని పీకుతుంది అమ్మాయి .. అంతగా తల దించుకునే పనేంచేసిందోనన్న అనుమానం నన్ను క్రుంగదీసింది కాసేపు ...

" తలెత్తి అబ్బాయిని చూడమ్మా .. " అన్న మా అమ్మమ్మ మాటకి ఉలిక్కిపడి , లేచి , నన్ను చూసింది అమ్మాయి ... ఈ సారి తలదించుకోవడం నా వంతయ్యింది , సిగ్గుతో ... కాసేపు చూపులు ఇచ్చిపుచ్చుకోని , కళ్లతో నవ్వుకున్నాం ..

"అమ్మాయిని ఎమన్నా అడగరా ? అలా బెల్లంకొట్టిన రాయిలా కూర్చుంటావేంటి ? " అన్న మా అమ్మమ్మ మాటలకి , ఉలిక్కిపడి లేవడం నావంతయ్యింది ఈ సారి ...

సడన్‍గా ఏమడగాలో తోచక , " టైమెంతయ్యింది .. " అనడిగా తత్తరపాటులో .. అమ్మలక్కలతో సహా అమ్మాయి కూడా పగలబడి నవ్వింది నా ప్రశ్నకి ... సిగ్గుతో కూడిన అవమానంతో ఇంకాస్త చించా కార్పెట్‍ని కాలి వేలితో ..

కాస్త ధైర్యం తెచ్చుకోని " మీరు సినిమాలు చూస్తారా ? " అనడిగి , మా అమ్మమ్మకేసి చూశా .. " నీకున్న సినిమాపిచ్చి అందరికీ తెలవాలట్రా కటౌట్ యెధవ " అన్నట్టూ చిరాగ్గా ఒక చూపు చూసింది నన్ను ..

" చాల తక్కువండీ ... భక్తి రస సినిమాలైతే బాగా ఇష్టంగా చూస్తాను ... " అంది మొహం మీద పడుతున్న ముంగిరిలు సవరించుకుంటూ ...

" అవునా ... మీరు రీసెంట్‍గా చూసిన భక్తి సినిమా ఎంటండీ " అనడిగాను రెట్టించిన ఉత్సాహంతో ..

" పాండురంగడు " అంది తలదించుకొని ...

" పాండురంగడా ????????? నేనడిగింది భక్తి సినిమా గురించండీ , బూతు సినిమా గురించి కాదండీ .." అనన్నాను కాస్త చిరాగ్గా ..

" నేను చెప్పింది అదేనండీ ... బాలక్రిష్ణ హీరోగా వచ్చిన పాండురంగడు సినిమానండి , మొత్తం మా ఫ్యామిలీ కలిసి చూశాము " అంది గోముగా ..

అప్పటివరకు కోలాహలంగా వున్న గది నిశ్శబ్ధంగా మారింది ... మా ఇంట్లోవాళ్ళు ఒక్కరొక్కరుగా బయటికి వెళ్ళిపోయారు .. మారుమాట్లాడకుండా నేను మా వాళ్ళని ఫాలో అయ్యాను ...

ఒక నెల గడిచింది ... పాండురంగడు ఎపిసోడ్ తరువాత మల్లి పెళ్ళి మాట తియ్యడానికే భయపడ్డారు మా ఇంట్లోవాళ్ళు ... ఈ సారి కాస్త చదువుకోని , ఉద్యోగం చేసే సిటీ అమ్మాయిని చూడమని చెప్పాను మా వాళ్ళకి ..ఉద్యోగ రీత్యా నేను పూణెలో ఉంటాను ... పూణెలోనే ఉంటూ ఉద్యోగం చేస్తున్న అమ్మాయి ఉందని , వివరాలన్ని నాకు మెయిల్ చేశాడు నా మేనమామ ... అమ్మాయి మొబైల్ నంబర్ తీసుకొని కాల్ చేసి మాట్లాడి , వీకెండ్ కలుద్దామనుకొన్నాము ... అనుకున్న సమయం కంటే కాస్త ఆలస్యంగా చేరుకున్నాను , మేమనుకున్న స్ఫాట్‍కి ... షాపింగ్‍మాల్ రద్దీగా ఉంది , వీకెండ్ కనుక .. అమ్మయికి కాల్ చేశాను .. ఐసిఐసిఐ ఎటిఎమ్ ముందర నిల్చోనున్నాను అంది .వెతుక్కుంటూ వెళ్ళాను ,ఏటిఎమ్ దగ్గరికి ...

అక్కడ ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు .. అందులో ఒకమ్మాయి సన్నగా , నాజుగ్గా , జుట్టు విరబోసుకొని , కూలింగ్ గ్లాసెస్ పెట్టుకోని అప్సరసలా ఉంది ... మరొక అమ్మాయి , జీన్స్ మీద సల్వార్ కమీజ్ టాప్ వేసుకొని , కాళ్ళకు పట్టీలు పెట్టుకొని , జడ వేసుకోని నుదిటిన కాస్త విభూది మార్క్ కి తోడు , బిందీ కూడా పెట్టుకుంది ... ఇంతటి ఎక్స్ పెరిమెంటల్ వేషధారణ భూప్రపంచంలో చేయగల్గే గట్స్ కేవలం మన తెలుగుమ్మాయిలకే ఉంటుందన్న కాన్ఫిడెన్స్ తో వెళ్ళి " హాయ్ సుజాత " అని పలకరించాను ...

" హే విజయ్ ... హౌ ఆర్ యూ ... ఐయామ్ ఫైన్ .. థ్యాంక్స్ " అని విష్ చేసింది .. కుశలప్రశ్నల తరువాత పక్కనున్న రెస్టారెంట్‍కి వెళ్ళి కూర్చున్నాము ... రెండు ఫ్రూట్ జ్యూస్‍లు ఆర్డర్ చేశాను .. రెండు తనే తాగేసింది..తన బాల్యం,కౌమార, యవ్వన దశల్లో జరిగిన వివిధ సంఘటనల సమాహారముతో నాన్‍స్టాప్ గా మాట్లాడుకుంటూ పోయింది ... నిప్పుల మీద కూర్చున్నట్లనిపించింది నాకు ... ఒక స్ట్ర్రాంగ్ టీ ఆర్డర్ చేశాను తలనొప్పి భరించలేక ... " ఒకటే చెప్పావే , నీకొద్దా " అంది .. దీనవదనంతో , రెండు తీసుకురమ్మన్నట్టూ బేరర్‍కి సైగ చేసాను ...

" హేయ్ విజయ్ సలీం సినిమా చూశావా ? సూపర్ సినిమా కదు " అంది ..
మూగకేక పెట్టాడు ఆత్మారాముడు ... కంటతడి పెట్టకుండా ఏడ్చాను...

ఇక ఇలా ఐతే లాభం లేదనుకోని , ఆ నిరంతర వాగుడు స్రవంతికి అడ్డుకట్ట వేయాలని డిసైడయ్యి , " వీకెండ్స్ లో ఎం చేస్తుంటావ్ ? " అనడిగాను ..

" బట్టలుతుక్కోని , నిద్రపోతానంది " ...

అరనిమిషం సైలెంటయిపోయాను ..తేరుకోని " ఆ తరువాత ఎమి చేస్తావ్ అనడిగాను " కూరుకుపోయిన గొంతుతో ..

" ఏముంది , ఆరిన బట్టలని ఇస్త్రీ చేసుకోని , మళ్ళి పడుకుంటాను .... " అంది గిగిల్ చేస్తూ ..,

" నిన్ను చేసుకుంటే , టైమ్‍పాస్ కాట్లేదని చెప్పి కాలనీ వాళ్ళ బట్టలుతికే రకమే నువ్వు దిక్కుమాలిందానా " అని కసిగా తిట్టుకున్నా లోలోన . బయటికి నవ్వుతూ నటిస్తూ ...

" అలా కాదు సుజతా , నీకంటూ కొన్ని హాబీస్ ఉంటాయి కదా , వాటి గురించి అడిగాను .. " అనన్నాను అసహనంగా ..

" హాబీస్ అంటూ ప్రత్యేకంగా ఎమీ లేవు కాని ... న్యూస్‍పేపర్లు , వీక్లీస్‍లో వచ్చే సినిమా పోస్టర్స్ లో ఉన్న హీరోయిన్లకి , మీసం లేని హీరోలకి మీసాలు, గడ్డాలు గీయడం అంటే చాలా ఇష్టం .. " అంది ముసిముసిగా నవ్వుతూ ...

నాకు బాధతో కూడిన కోపం నషాళానికి ఎక్కింది ...

" మరి నీ హాబీస్ ఎంటి విజయ్ ???? అనడగింది ఆ వాగ్దేవి ( వాగుడు + దేవి ) ...

" చాలానే ఉన్నాయి .. బాత్రుంలో ఎవరన్నా దూరితే బయటీ నుండి గడి పెట్టేయ్యడం , దుమ్ము పట్టిన కారు అద్దాల మీద పేర్లు రాయడం , ముక్కులో చీపురు పుల్లలు పెట్టుకోని తుమ్మడం , దక్షిణమధ్య రైల్వేస్ టాయిలెట్లలో బూతుబొమ్మలు గీయడం , నీలాంటి అమ్మాయితో హోటల్‍కి వచ్చినప్పుడు బిల్ల్ కట్టకుండా పారిపోవడం etc. " అని వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తాను..

ఇంటికెళ్ళాక మా అమ్మమ్మకి ఫోన్ చేసి " ఇంకా సంబధాలు చూడకండి .. నేను సన్యాసం తీసుకోబొతున్నాను " అని చెప్పి , ఆరంజ్ కలర్ జీన్స్ , టీ షర్ట్ కొనుక్కోవడానికి బట్టల కొట్టుకి బయలుదేరాను ...
Posted by వీజె at 12:31 AM

5 కామెంట్‌లు:

sri చెప్పారు...

బావుంది మీ టేస్టు నాకెంతో నచ్చేట్టు...
పై కథ చదువుతూంటే నా తోలి అనుభవం గుర్తొచ్చింది..అపార్ధం చేసుకునేరు తోలి అనుభవం అంటే నా ఫస్ట్ పెళ్లి చూపుల ఎక్స్పీరిఎన్సు అని.
నాకు చెప్పకుండా మా మేనమామ ఒక సంబందానికి తీసుకెళ్ళాడు, నేను చుట్టం చూపుగా ఒకసారి హైదరాబాద్ వెళ్ళినపుడు. ఇద్దరం జాలిగా కారులో వెళ్తుంటే మద్య దారిలో చెప్పాడు, అమ్మాయిని చూస్తున్నాం అని. నాకు తెలియదు కానీ ఆ అమ్మాయి వాళ్ళకి తెలుసు కదా, చక్కగా ముస్తాబై వచ్చింది 'తను'. తను అంటే ఆ అమ్మాయి. నాకేమో ఫస్ట్ టైం కదా, పైగా ప్రిపేర్ అయ్యిలేనేమో టెన్షన్ గా అనిపించసాగింది. పెద్దవాళ్ళ ఇంటర్వ్యూ అయ్యాక మాకు మాట్లాడుకోవడానికాని కొంచం టైం ఇచ్చారు.
'తను': ఎక్కడ జాబ్ చేస్తున్నారు...
'నేను': ఫలానా కంపెనీ..మీరు ఏమి చదివారు?
'తను': ఎం.ఎస్సీ కంప్యుటర్స
'నేను': ఓ, మీరు ఎం.ఎస్సీ కంప్యుటర్స ఏనా? ఏ యునివర్సిటీ?
'తను': ఓ యు, మరి మీరు?
నేను: ఏ యు.
'తను': మీకు ఫస్ట్ పెళ్లి చూపుల ఇవి?
నేను: అవును, ఎందుకు అలా అడిగారు?
'తను': ఏమిలేదు.
కొంతసేపు మౌనం
'తను': (ఏదో మాట్లాడలనేంతలో.. )
వాళ్ళ పెదనాన్న ఏమ్మా అయ్యిందా? ఇంకా లోపలకి రండి.


రిటర్న్ జర్నీలో మా మామయ్య: ఏరా పిల్ల నచ్చిందా?
నేను: నాకు ఓకే (అమ్మాయి బావుంది చూడటానికి)

వాళ్ళ నుండి -ve రెస్పాన్స్. అమ్మాయి వాళ్ళ పెదనన్నకి అభ్యంతరంట.

sri చెప్పారు...

ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావిడి

ee post kooda meeku nachhutundi mee blog lo post chesukovachhu. permissions granted

http://bbcind.blogspot.com/2011/05/blog-post_3666.html?m=1

శ్రీ చెప్పారు...

హాయ్ నేస్తం... పూతరేకులు బ్లాగ్ చూసారా? అదికూడా మీకు నచ్చచ్చు
http://pootarekulu.blogspot.com/

శ్రీ చెప్పారు...

పెళ్లి చూపులకు కూడా ఒక కామన్ కొశ్చన్ ఆన్సర్ లు వుండాలి ఎలా అంటే ....

స్కూలుపిల్లాడొకడు పరీక్షకెళ్తూ ఒకేఒక్క వ్యాసం చదువుకుని వెళ్ళాడట.అది ఆవు గురించి.తీరా పరీక్షలో విమానం మీద,రైలు మీదా వ్యాసం రాయమని అడిగారట. మనవాడికి ఆవు ఒక్కటే తెలుసు.ఇక వ్యాసపరంపర ఇలా సాగింది."విమానం గాలిలొ ఎగురుతుంది.దానికి రెక్కలుంటాయి.పైకి ఎగిరాక కిందకి చూస్తే పచ్చిక బయళ్ళు కనబడ్తాయి. అక్కడ గడ్డిమేస్తూ ఆవులుంటాయి. ఆవు సాధుజంతువు. దానికి రెండు కొమ్ములుంటాయి.నాలుగు కాళ్ళుంటాయి.ఆవు పాలిస్తుంది. పేడ వేస్తుంది...." ఇలా మొత్తం ఆవుగురించే రాసేశాడు.

ఇక రైలు గురించి మొదలెట్టి " రైలు పట్టాల మీద నడుస్తుంది.దాని ఇంజన్ వెనక పెట్టెలుంటాయి. అందులో ఎక్కి వెళ్తుంటే పట్టాల పక్కన గడ్డిమేస్తూ ఆవులుంటాయి. ఆవు సాధుజంతువు. దానికి రెండు కొమ్ములుంటాయి.నాలుగు కాళ్ళుంటాయి.ఆవు పాలిస్తుంది. పేడ వేస్తుంది...." మళ్ళీ ఇదే సోది..ఎందుకంటే వాడికొచ్చింది అదొక్కటే గనుక. ఈవిధంగా తిరిగి తిరిగి మొదటికే వచ్చే జీడిపాకాన్ని "ఆవుమీద వ్యాసం" అని చిన్నప్పుడు నవ్వుకునేవాళ్ళం.

ఇలా "ఆవుమీద వ్యాసం" మేధావుల వర్గంలో ప్రసిద్ధులయిన సినిమా వ్యక్తులు దాసరి నారాయణ రావు, ఆయన శిష్యుడు మోహన్ బాబు.

మోహన్ బాబు తీరు ఎలా ఉంటుందంటే....ఈ కింది ప్రస్తావనలు తప్పనిసరిగా ఉంటాయి.

1. అన్నయ్య (NTR)
2. మా గురువుగారు దాసరి
3. మా విష్ణు బాబు, మా మనోజ్ బాబు
4. మా పాప లక్ష్మీప్రసన్న
5. విద్యానికేతన్ కాలేజ్
6. ప్రజలే దేవుళ్ళు.
7. బాబా ఆశీస్సులు

ఒక కాలేజ్ వార్షికోత్సవంలో ఇలా ఉంటుంది ఆయన "ఆవుమీద వ్యాసం"

"ఈ కాలేజ్ పిల్లల్ని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. అన్నయ్యతో కలిసి 1995లో మేజర్ చంద్రకాంత్ షూటింగ్ సందర్భంగా ఫలానా కాలేజ్ కి వెళ్ళిన సంఘటన గుర్తొస్తున్నది. ఆ రోజే మా గురువుగారు దాసరిగారు కూడా ఇంకో ఫలనా కాలేజ్ లో షూటింగ్ కి వెళ్ళారు.మా విష్ణుబాబుని కూడా ఇదే కాలేజ్ లో చేర్పించి IPS చేయించాలి అనుకున్నాను. కానీ అభిమానుల (?) కోరికమేరకు సినిమాల్లోకి తెచ్చాను.మరి పాప లక్ష్మీప్రసన్న కూడా అమెరికాలో ఫలానా కోర్సు చేసింది.ఈ కాలేజ్ కూడా అచ్చం మా విద్యానికేతన్ కాలేజ్ లా ఉంది.అక్కడ 2 వేలమందికి చదువు చెబ్తున్నాం. అడ్మిషన్ ఫాంలో కులం పేరు అడగని ఏకైక కాలేజ్ మాదే. మరి దీన్ని లెజెండ్ అనరా ? ప్రజలే దేవుళ్ళు.వాళ్ళు చూస్తున్నారు.బాబా ఆశీస్సులు నాకు,నా కుటుంబానికి కావాలి. ఇక్కడున్న పిల్లలంతా నాలాగే మంచివాళ్ళు. మేము ఎవరికీ హాని చేసేవాళ్ళం కాదు. ఒకరిగురించి చెడుగా తలిచేవాళ్ళం కాదు... "

ఇంతవరకు ఏ తానా సభలకిగాని,ఆటా సభలకిగానీ ఆహ్వానం అందినట్లు లేదుగానీ, ఒకవేళ వస్తే గిస్తే ఆయన "ఆవుమీద వ్యాసం" ఇలా ఉంటుంది....

"ఇంతమంది ప్రవాసాంధ్రుల్ని చూస్తుంటే అన్నయ్య చెప్పినట్లుగా చేయెత్తి జైకొట్టు తెలుగోడా అనాలనిపిస్తుంది. మా గురువు దాసరి గారు ఇదేమాట అన్నారు. మీరంతా నాలాగే క్రమశిక్షణతో కష్టపడి పైకొచ్చినవాళ్ళు. మనం ఎవరికీ హాని చేసేవాళ్ళం కాదు. ఒకరిగురించి చెడుగా తలిచేవాళ్ళం కాదు.అసలు మా మనోజ్ బాబు అమెరికా వెళ్ళి IPS అవుతా నాన్నా అని అడిగాడు.కానీ, మళ్ళీ అభిమానుల వత్తిడికి తలొంచి సినీకళామతల్లికి నా జంటసింహాలను అంకితం చేశాను.మరి దీన్ని లెజెండ్ అనరా ? ఇక్కడ ఉన్న కొందరు NRIలు నన్ను అడిగారు. వాళ్ళ పిల్లలకి క్రమశిక్షణ నేర్పమని. మీ పిల్లల్ని హార్వర్డ్,స్టాన్ ఫర్డ్ లాంటి చోట్లకి కాకుండా మా విద్యానికేతన్ కి పంపండి అని చెప్పాను.ఏది ఏమయినా బాబా ఆశీస్సులు నాకు,నా కుటుంబానికి కావాలి......."

ఇదీ ఆయన వరస !

నేస్తం చెప్పారు...

:)kondarante andi