18, ఆగస్టు 2010, బుధవారం

మాటల యుద్ధం ముగిసిన వేళ...

http://naaspandhana.blogspot.com/2009/01/blog-post_06.html (లలిత-నా స్పందన)




"ఏవోయ్"
"................."
"ఇదిగో నిన్నే"
"...................."
"నిన్నేనోయ్ నా అర్ధాంగీ "
"......................."
"దయచూపగరాదా దేవీ........................."
"...................."
"ఐతే ఇక అంతేనా , నే పోనా..............."
"ఏవిటీ అంతేనా"?
"మూడురోజులనుండి బ్రతిమాలుతున్నా "
"ఎవరూ బ్రతిమాలమన్నదీ"
"నువ్వలా వుంటే నాకు వుండబుద్ది కావద్దూ"
"అబ్బో ప్రేమ కారిపోతుంది లెండి "
"మరికాదా"?
"అంత ప్రేమున్నవారు నన్నంత మాట ఎలా అనగలిగారో "?
"ఏ మాట".....ఎప్పుడూ"?
"అబ్బే ఏం ఎరగరుమరి"
" ఒహో...అదా నువ్వింకా అదే తల్చుకు బాధపడితే ఎలా "?
"ఎలా అంటే వదిలెయ్యండి .......ఈ బ్రతిమాలడాలెందుకూ"?
"ఎందుకేవిటీ నువ్విలా వుంటే నాకు పనిమీద మనసు నిలవటం లేదు మరి .ఎంత బాధగా వుందో తెలుసా "
"అంత బాధ పడేవారైతే నన్నంత మాటంటారా"?"............... " అదీ మీ అమ్మగారి ముందు"
"అదన్న మాట అసలు సంగతి ,మొగుడు కొట్టినందుకు కాదు తొడికోడలు నవ్వినందుకు అన్నట్టుంది "..........
"కాదూ మరి "! విన్న అవిడ వూరకే వుంటారా నలుగురికీ చెప్పకుండా "?
"చ అమ్మ అలా చేయదులే "
"ఆహా... మీరు నన్నంత మాట అంటుంటే ఆవిడ మొహం ఎంత వెలిగిపోయిందో గమనిస్తే తెలిసేది "
".............................."
" మా ఆయన నన్ను పల్లెత్తు మాటనరు " అని తోడికోడళ్ళతోనూ, ఆడబడుచుల తోనూ గర్వంగా చెప్పుకునేదాన్ని .............ఇప్పుడు అంతా కూడి నా వెనకే నవ్వరూ"?
"అదేవంత మాట . ఏదో ఆరోజు చికాకులో నోరు జారింది అందుకేగా క్షమించమని నీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంది "
"............................."
" అయినా ఆ చిన్న మాటకే నువ్వింత మనసు కష్ట పెట్టుకుంటావని తెలియకా................."
అవున్లెండి ...నా కష్టం తమకెప్పుడు తెలియాలి "?
"...................."
"ఇంటెడు చాకిరీ ఒక్క చేత్తో చేసుకొస్తున్నానన్న జాలైనా లేకుండా నన్నంట మాట అంటారా "?
"జాలి లేకేం బంగారూ....." సుకుమారంగా పెరిగిన మా రాణి గారి సేవకి ఒక్క పరిచారికనైనా నియమించలేకపొయితిమని బాధ పడని రోజుంటే ఒట్టు "
"అబ్బో ..........ఈ వెటకారాలకేం తక్కువ లేదు రాజా వారికి " అంత సుకుమారి వైతే పుట్టింటి నుంచి పనిమనిషిని తెచ్చుకోవలసింది అనేకదూ మీ దెప్పిపొడుపు"
"హవ్వ.... " " నా మాటకర్ధం అదికాదోయ్" నా వుద్దేసం ............"
"అర్ధం అదే, వుద్దేసం అదే ఆ మాత్రం పసిగట్ట లేని అమాయకురాలిని అనుకున్నారా"?
"అయ్యో ............ నువ్వలా వూరకే బాధ పడుతుంటే నా కేం మాట్లాడాలో తెలియట్లేదు "
"ఇంకేం తెలియాలి అనాల్సిన మాటలెప్పుడో అనేసారుగా "?
" నేనా......ఏమనేసానూ"?
"మళ్ళీ మొదటికొస్తున్నారా ..........నన్నన్న మాట మరిచిపోయారా"?
"అబ్బ ఇంకా అదే సాగదీస్తే ఎలా"
"నేనా సాగదీసింది "?...........నా మానాన నేనుంటే మీరు కదూ వచ్చి అదిపింది"
"కదపక పోతే ఎలా నువ్వల మూతి ముడుచుకుని ,మాట్లాడకుండా వుంటే నేనెలా హాయిగా బ్రతికేసేది"
"ఆహా....... చాల్లెండి బడాయి. అబ్బ .....చెయ్యొదలండి"
"ఆ............అమ్మా"
"అయ్యో ఏవయిందండీ"?
"నిన్ను బాధ పెట్టినదుకు పగ తీర్చుకుంది కామోలు"......... "నీ గాజు గీసుకుంది"
"అరెరే రక్తం వస్తుందండీ, లోపలికి తెగిందల్లే వుంది . అయ్యయ్యో ఆ చెయ్యిటివ్వండి "
"పర్వాలేదు నా కీ శాస్తి జర్గాల్సిందే
'చీ ,చీ పాపిస్టిదాన్ని అంతా నావల్లే , "చెయ్యి విదిలించి కొట్టాను"
"ఏం కాదులే కొద్దిగానేగా తెగింది"
"ఇంత రక్తం పోతుంటే కొద్దిగా అంటారేం "
"అయ్యో నేనింత పట్టుపట్టాల్సింది కాదు .మూర్ఖపు పీనుగని మీ రక్తం కళ్ళ చూసేవరకూ వదల్లేదు "
"లేదులే నేనా మాట ............."'
" చిరాకులో మొగుడో మాటం టే మటుకు ఇంత రాద్ధంతం చెయ్యాలా ......అంతా నావల్లే"
"నేనసలామాట.............."
" మళ్ళీ ఆ మాటెత్తితే నా మీద ఒట్టే "
"అదికాదోయ్............"
" ఇక చాల్లే వూరుకోండి " "అయినా మీకన్నా వుండక్కరలా'? నేను మిమ్మల్ని అంతలేసి మాటలంటూంటే మీరైనా ఒక్క గసురు గసిరితే ఆగేదాన్ని కాదా.....ఇది ఇంతవరకూ వచ్చేదా"??????
" ఆ............"
"ఆ............."

1 కామెంట్‌:

నేస్తం చెప్పారు...

లలితా ఇది చదివితే అమ్మ,పిన్నులు,అక్కలు,అంతెందుకు నాకు నేనే గుర్తువచ్చాను...ఇప్పుడు తరం వాళ్ళకు చాలామందికి ...ఈ అలకలు బుజ్జిగింపులు తెలియవు ....రావు ... ఎంత జాలేస్తుందో..
ఈ పోస్ట్కు స్పందనగా విజయ్ కుమార్ గారు "మొగుడూ పెళ్ళాలంటే ఇలానే ఉండాలి మరి.అయినా కోపం తగ్గాలంటే రక్తం చిందించాల్సిందేనా .బ్రహ్మాండం అంటే "
నీ సమాధానం "విజయ మోహన్ గారూ జరిగింది యుద్ధం కదండీ , ఆ మాత్రం రక్తం చిందైనా చివరికి శాంతి నెలకొంది.అది చాలుకదా " సూపర్..నాకైతే రాజమండ్రి వీధుల్లో వర్షంలో తడిచిన అనుభూతి అనిపించింది ఈ కధ చదివితే చివరిగా చెప్పిన పిట్ట కధ
ఇంత ప్రోత్సాహం చూసాకా ఈ కధ ఇక్కడ రావడానికి ముందూ వెనకా జరిగిన పిట్టకధ కూడా మీ కు చెప్పేయాలి

"ఏవండోయ్, ఇది చూడండి "
"హవ్వ ఇలాంటివి రాసుకుంటారా? నవ్వి పోతారు"
"ఇలాంటివే రాసుకుంటారు, కావాలంటే చూడండి ,పది వ్యాఖ్యలకి తక్కువ రావు "
"ఆహా....పదికి ఒక్కటెక్కువొస్తే వెయ్యినూటపదార్లు బహుమతిగా ఇస్తా "
"ఆ మాటమీదే నిలబడండి
**************
"ఏవండోయ్ ఇప్పుడేవంటారు " పదహారు వ్యఖ్యలు ,ఇవ్వండి" వెయ్యినూటపదార్లు "
"పదికి ఒక్కటెక్కువొస్తే నెగా నే ఇస్తానన్నది . మరి ఇన్నొచ్చాకా ఇంకెక్కడి బహుమానం "
ఆ...........
ఆ..............
**************
ఇప్పుడు చెప్పండి యుద్ధాలు వూరకనే మొదలవుతాయా

ఇది భలే చెప్పావ్...